ఐదు నిమిషాల్లో కరోనా నిర్థారణ

20 May, 2020 17:45 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ నాసిక్‌లో ఉన్న ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ, ఈఎస్‌డీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కరోనాను నిర్ధారించే పరికరాన్ని కనిపెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా పనిచేసే ఈ పరికరం ఛాతీ ఎక్సరే ద్వారా కరోనాను నిర్థారణ చేయగలుగుతుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులు  మాట్లాడుతూ... తమ టెస్టింగ్‌ టూల్‌ ఐదునిమిషాల్లో కరోనాను నిర్థారించగలదని తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ఇది పూర్తిగా కాంటాక్ట్‌ లెస్‌ పరీక్షా విధానమని తెలిపారు. దీనిలో ఛాతి ఎక్స్‌- రే రిపోర్టలను తీసుకొని వాటిని వెబ్‌బ్రౌసర్‌లో అప్‌లోడ్‌ చేయాలని, తరువాత సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలని తెలిపారు. తరువాత వెంటనే అది ఆ వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడో లేదో తెలియజేస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి)

 ఈ విధానాన్ని చైనా, ఫ్రాన్స్‌, ఇజ్రాయిల్‌, యూకే లాంటి ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయని కూడా కంపెనీ పేర్కొంది. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తోన్నామని, ఇప్పటి వరకు 8,500 ఛాతి ఎక్స్‌-రేలను పరీక్షించామని వాటిలో 96 శాతం మంచి ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా కేసలు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కరోనాను తొందరగా నిర్థారించడానికి ఇది బాగుంటుందని ఈఎస్‌డీఎస్‌ సంస్థ సీఈఓ పియ్యూష్‌ సొమానీ తెలిపారు. 
(త్రీస్టార్.. తిరుపతి వన్)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు