నిజామాబాద్‌ మార్కెట్‌కు జాతీయ అవార్డు

22 Apr, 2017 02:15 IST|Sakshi
నిజామాబాద్‌ మార్కెట్‌కు జాతీయ అవార్డు

ప్రధాని చేతుల మీదుగా స్వీకరించిన జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ/ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం (ఈ–నామ్‌) అమలులో నిజామాబాద్‌ మార్కె ట్‌కు ‘ప్రధాన మంత్రి అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌–2017’ దక్కిం ది. 11వ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అవార్డు స్వీకరించారు.

ఈ–నామ్‌ విభాగం లో ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సోలన్‌ జిల్లా, ఇతర రాష్ట్రాల కేటగిరీలో నిజామాబాద్‌ జిల్లా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ప్రశంసా పత్రంతోపాటు రూ.10 లక్షల నగదు బహుమతిని యోగితా రాణా అందుకున్నారు. అవార్డు సాధించినందుకు జిల్లా కలెక్టర్, మార్కెటింగ్‌ అధికారులు, సిబ్బందిని మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో అభినందించారు. ‘ఈ నామ్‌’ అమలుకు కేంద్రం దేశవ్యాప్తంగా 22 మార్కెట్లను గుర్తించగా అందులో తెలంగాణలోని నిజామాబాద్, వరంగల్, తిరుమలగిరి, మలక్‌పేట, బాదేపల్లి మార్కెట్లు ఉన్నట్లు హరీశ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు