207 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగరాలి!

19 Feb, 2016 09:34 IST|Sakshi
207 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగరాలి!

* సెంట్రల్ వర్సిటీల వీసీ భేటీలో స్మృతి ఇరానీ
* కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సీపీఎం

సూరజ్‌కుండ్: విద్యార్థుల్లో జాతీయ భావన పెంచేందుకు దేశంలోని 46 సెంట్రల్ వర్సిటీల్లో ప్రతిరోజూ 207 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగరేయాలని వీసీల సమావేశం నిర్ణయించింది. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో సూరజ్‌కుండ్‌లో జరిగిన సెంట్రల్ వర్సిటీల వీసీల సమావేశంలో ఈమేరకు తీర్మానం చేశారు. తొలి పతాకాన్ని జేఎన్‌యూలో ఎగురవేయనున్నారు. ఇప్పటికే వర్సిటీల్లో జాతీయ జెండా ఎగురుతోంది. అయితే.. అన్ని చోట్లా దీని ఎత్తు సమానంగా ఉండాలని  నిర్ణయించారు.

2012 యూజీసీ చట్టం (వర్సిటీల్లో సమానత్వ భావన పెంచటం, ఎస్సీ, ఎస్టీల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించటం) అమలుపై ల చర్చించారు. కాగా, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. జాతీయ పతాకాన్ని ఎగరేయటం, వందేమాతర గీతాన్ని ఆలపించటం వల్లే జాతీయ భావం పెంపొందుతుందా అని ప్రశ్నించింది. సీపీఎం నాయకురాలు బృందా కారత్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు