నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం

29 Aug, 2019 05:00 IST|Sakshi

భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్‌లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించనున్నారు. స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా, మహిళా పారాథ్లెట్‌ దీపా మలిక్‌లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’ అందుకోనున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ ‘అర్జున అవార్డు’ను పొందనున్నాడు. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌ జాతీయ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.      

మరిన్ని వార్తలు