పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలపై విచారణ

24 May, 2016 17:11 IST|Sakshi

ఢిల్లీ: పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్‌ విచారణ చేపట్టనుంది. పోలవరం ప్రాజెక్టుతో లక్షా 7 వేల మంది గిరిజనులు నిరాశ్రయులౌతున్నారని ఎస్టీ కమిషన్‌ పేర్కొంది. నిర్వాసితులైన గిరిజనుల పరిహారంపై ఎస్టీ కమిషన్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

సరైన నష్ట పరిహారం, పునరావాసం కల్పించలేదని ఎస్టీ కమిషన్‌ అభిప్రాయపడింది. నిరాశ్రయులౌతున్న గిరిజనుల స్థితిగతులు తెలుసుకునేందుకు జూలైలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఎస్టీ కమిషన్‌ పర్యటించనుంది.

మరిన్ని వార్తలు