సీక్వెల్ తో మరీ వెంటాడతారట?

7 Aug, 2014 09:13 IST|Sakshi
సీక్వెల్ తో మరీ వెంటాడతారట?

సినిమాలే కాదు ఇప్పుడు పుస్తకాలకు కూడా సీక్వెల్..... వస్తున్నాయి. సీక్వెల్ రావటంలో విశేషం ఏమీ లేకున్నా.... గతంలో చాలా పుస్తకాలు అలా వచ్చివవే. అయితే నిను వీడని నీడను నేనే..... అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి నట్వర్ సింగ్  మళ్లీ వెంటాడేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే  ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకం పేరు సోనియాపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన ఆయన...ఈసారి సీక్వెల్ పుస్తకంలో కడిగి పారేస్తానని చెబుతున్నారు. తన పుస్తకానికి కొనసాగింపుగా మరో పుస్తకాన్ని (సీక్వెల్) రాసి మరిన్ని విషయాలు బయట పెట్టేందుకు నిర్ణయించుకున్నారట.


‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నా నట్వర్ సింగ్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఈసారి ‘మై ఇర్రెగ్యులర్ డైరీ’ పేరుతో పుస్తకం రాస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పుస్తకం అందుబాటులోకి రావాలంటే వచ్చే ఏడాది మార్చి వరకూ వేచి చూడాల్సిందే.  ఇటీవలి విడుదల అయిన ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకానికి మాత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ బుక్ హాట్ కేక్ల్లా 50వేల ప్రతులు అమ్ముడు పోవటంతో... ఈ పుస్తకాన్ని ప్రచురణకర్తలు పునర్ ముద్రిస్తున్నారు. మరి ఈసారి నట్వర్ సింగ్  తన డైరీ ద్వారా ఎలాంటి మాటల తూటాలు వదులుతారనేది ఇప్పటి నుంచి ఆసక్తి నెలకొంది.

 

మరిన్ని వార్తలు