కరోనా: ప్రధానికి ఒడిశా సీఎం లేఖ

20 Mar, 2020 19:37 IST|Sakshi

భువనేశ్వర్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌- 19) వ్యాప్తి నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రాణాంతక వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో జాతీయ జనగణన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేనషల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ నవీకరణ ప్రక్రియను వాయిదా వేయాలని శుక్రవారం విజ్ఞప్తి చేశారు. కాగా 2021 ఏడాదికి సంబంధించి ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఎన్పీఆర్‌ ప్రక్రియను చేపట్టాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.(కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం)

మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటిదాకా 223 కేసులు నమోదు కాగా... నలుగురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. సినిమా హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లను మూసివేస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రజా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షలకు పైగా కరోనా అనుమానితులు ఉండగా... దాదాపు 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.(కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : మోదీ)

మరిన్ని వార్తలు