ఉపవాసం చేసే వారికోసం ప్రత్యేక ఆహారం

11 Oct, 2018 05:36 IST|Sakshi

న్యూఢిల్లీ: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్న రైలు ప్రయాణికుల కోసం ‘వ్రత్‌ కా ఖానా’ పేరిట కొత్త మెనూ సిద్ధంచేసినట్లు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పోరేషన్‌(ఐఆర్‌సీటీసీ) తెలిపింది. సాత్వికాహారం అయిన సగ్గుబియ్యం, సైంధవ లవణం, కూరగాయాలతో తయారుచేసిన ఆహారపదార్ధాలను రైల్వే మెనూలో అక్టోబర్‌ 10 నుంచి 18వ తేదీవరకు రైళ్లలో అందిస్తామని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. రైళ్లో భోజనం కోసం ఉపవాస దీక్షలో ఉన్న వారు ఇబ్బందిపడకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు అని తెలిపింది. సగ్గుబియ్యం కిచిడి, లస్సీ, తాలి, ఫ్రూట్‌ చాట్స్‌లనూ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. జర్నీ మొదలవడానికి రెండు గంటలముందుగా పీఎన్‌ఆర్‌ నంబర్‌ సాయంతో కొత్త మెనూలోని ఆయా ఆహారపదార్ధాలను ఠీఠీఠీ.్ఛఛ్చ్టి్ఛటజీnజ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn ద్వారా ఆర్డర్‌ చేయొచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు