గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ

1 May, 2019 12:48 IST|Sakshi

36 వాహనాలకు నిప్పుపెట్టిన మావోలు 

సాక్షి, గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్‌ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా ఈ ఏడాది జనవరిలో కూడా మావోలు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఈ సందర్భంగా ఘటనా స్థలంలో కరపత్రాలు వదిలి వెళ్లారు. మరోవైపు తమ వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు