డెంగీ నియంత్రణకు చర్యలు తీసుకోండి

27 Jun, 2014 23:17 IST|Sakshi
డెంగీ నియంత్రణకు చర్యలు తీసుకోండి

- పడకలు, పరికరాలు సిద్ధంగా ఉంచాలి
- ట్యాంకులకు మరమ్మతులు చేయాలి
- ఆస్పత్రులకు ఎన్డీఎమ్సీ ఆదేశం
న్యూఢిల్లీ:
వర్షాకాలం సమీపిస్తున్నందున డెంగీ వంటి అంటువ్యాధుల నియంత్రణపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎమ్సీ) దృష్టి సారించింది. ఈ వ్యాధుల చికిత్సకు అవసరమైన అత్యవసర పడకలు, రక్తం యూనిట్లు, పరికరాలను సిద్ధం గా ఉంచుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేషన్ గురువారం ఆదేశించింది. అంటువ్యాధుల నియంత్రణలో భాగంగా ఎన్డీఎమ్సీ కమిషనర్ ప్రవీణ్ గుప్తా సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన భేటీలో పైఆదేశాలు జారీ చేశారు.

వ్యాధుల నియంత్రణకు తమ విభాగాలు తీసుకునే చర్యలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. నీరు నిల్వకాకుండా, దోమలు వృద్ధి చెందకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని గుప్తా ఆదేశించారు. ఎన్డీఎమ్సీ అదనపు కమిషనర్ (ఆరోగ్య విభాగం), మున్సిపల్ వైద్యాధికారి, ఢిల్లీ జలబోర్డు ప్రతినిధులు, ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), పీడబ్ల్యూడీ, ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ), ఢీల్లీ రవాణాసంస్థ (డీటీసీ) ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

వర్షాలు పడ్డప్పుడు నీరు నిల్వకాకుండా నిరోధించేం దుకు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని గుప్తా పర్యావరణ నిర్వహణ సేవాసంస్థ (డీఈఎంఎస్)ను ఈ సందర్భంగా ఆదేశించారు. గత ఏడాది డెంగీ విజృంభించడంతో ఎన్డీఎమ్సీ ఈ చర్యలు తీసుకుంది. నిరుడు 5,500 మందికి ఈ వ్యాధి సోక గా, ఆరుగురు మరణించారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం 2010లో ఢిల్లీలో అత్యధికంగా 6,200 కేసులు నమోదయ్యా యి.

2009లో 1,153, 2008లో 1,300 కేసులు, 2011లో 1,131 కేసులు, 2012లో 2,093 కేసులు, గత ఏడాది 5,574 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ కారక దోమల వృద్ధి చెందకుండా నిరోధించడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంకులకు మూతలు ఉండేలా చూడాలని ఎన్డీఎమ్సీ వాటి ఇంజనీరింగ్ విభాగాలను ఆదేశించింది.
 
ట్యాంకులకు కూడా మరమ్మతులు నిర్వహిం   చాలని సూచించింది. ఫౌంటెయిన్లు, కృత్రిమ జల పాతాల నుంచి నీటిని తోడివేయాలని కమిషనర్ ప్రవీణ్ గుప్తా ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. వ్యాధుల నియంత్రణ చర్యలపై చర్చించేందుకు సిబ్బందితో పక్షం రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఆయన జోనల్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు