సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఉంటే తక్కువ వడ్డీకే లోన్!

30 May, 2016 13:55 IST|Sakshi

ముంబై: మీరు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారా ? తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే, మీ సోషల్ మీడియా అకౌంట్లలో స్నేహితులు, ఆఫీసు సహచరులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే కాస్త మంచిదే!. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ మాదిరిగానే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వ్యక్తుల సోషల్ మీడియా రిలేషన్స్ బట్టి లోన్ లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వ్యక్తి సోషల్ వర్త్, పర్సనల్ డిటైల్స్, బ్యాంక్ స్టేట్ మెంట్లు అతను లేదా ఆమె ఏ మేరకు లోన్ ను తిరిగి చెల్లించగలరనే అంశాన్ని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

మొదటి సారి లోన్ కి దరఖాస్తు చేసుకునే వారికి సోషల్ వర్త్ బాగా కీలకంగా మారుతోంది. వ్యక్తి సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి బ్యాంకులు కొత్త విధానాలను ఉపయోగిస్తున్నాయని క్రెడిట్ మంత్రి సహ వ్యవస్థాపకుడు రంజిత్ పుంజా తెలిపారు. తమకు ఇప్పటికే ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఉందని లోన్ ప్రాససింగ్ లో ఈ పద్దతిని ఫాలో అయిపోతున్నట్లు వివరించారు. తాము ఎక్కువగా ఇప్పుడే ఉద్యోగం లో చేరిన వారికి లోన్ లను కల్పిస్తున్నట్లు చెప్పారు. వారి గురించిన సమాచరాన్ని సేకరించడానికి ఫేస్ బుక్, గూగుల్ ప్లస్, లింక్డ్ ఇన్ లపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు లోన్ తీసుకోవాలని అనుకుంటే కచ్చితంగా సోషల్ మీడియా అకౌంట్లను వినియోగిస్తూ ఉండాలని చెప్పారు.
 

మరిన్ని వార్తలు