రెండు రాష్ట్రాల్లోనూ ‘నీట్’ తప్పనిసరి

27 Jul, 2016 02:51 IST|Sakshi

ఎంపీ సీఎం రమేశ్ ప్రశ్నపై తేల్చిచెప్పిన కేంద్రం

 సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టికల్ 370-డీ అమలులో ఉన్నప్పటికీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

‘భారత వైద్య మండలి చట్టం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశం మొత్తంమీద వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తుంది. నీట్ వల్ల రాష్ట్రాల ప్రవేశాల విధానానికి ఎలాంటి అంతరాయం వాటిల్లదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లలో ఆయా రాష్ట్రాల అభ్యర్థులకే సీట్లు ఇచ్చుకోవచ్చు’ అని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు