నీట్ పై సుప్రీంలో పిటిషన్

25 May, 2016 11:07 IST|Sakshi

న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష (నీట్) పై వివాదం అప్పుడే ముగిసేలా కనబడటం లేదు. నీట్ పై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ సంకల్స్ చటర్జీ ట్రస్ట్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమనిదీని వల్ల వైద్య విద్యలో సంస్కరణలు నిలిచిపోయే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు .

 

పిటిషనర్ తరఫు న్యాయవాది అమిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ... న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై కార్యనిర్వాహక శాఖ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకి తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ యేడాది రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి సొంతంగా పరీక్షను నిర్వహించుకునే ఆర్ఢినెన్స్ పై ఇటీవలే సంతకం చేశారు. తమిళనాడు సీఎం జయలలిత తమ రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించమని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది

మరిన్ని వార్తలు