వచ్చే ఏడాది నుంచి ఉర్దూలోనూ నీట్‌!

14 Apr, 2017 01:14 IST|Sakshi

న్యూఢిల్లీ: 2018–19 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ను ఉర్దూలోనూ నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

మే 7న జరిగే ఈ ఏడాది నీట్‌లోనే ఉర్దూ మీడియాన్ని ప్రవేశపెట్టాలని పిటిషనర్‌ కోరగా  అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ‘అద్భుతాలు చేయమని మేం కేంద్రాన్ని ఆదేశించలేం. పరీక్ష మే 7 న ఉంది. ఈ రోజు ఏప్రిల్‌ 13. ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం సాధ్యం కాదు’ అని బెంచ్‌ స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు