ఢిల్లీలో నేతాజీ స్మృతి చిహ్నం: కేంద్రం

30 Apr, 2016 01:43 IST|Sakshi
ఢిల్లీలో నేతాజీ స్మృతి చిహ్నం: కేంద్రం

 న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకాన్ని నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నేతాజీకి చెందిన మరో 25 పత్రాలను బహిర్గతం చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 1956-2009 మధ్య కాలానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన 5 ఫైళ్లు, హోం శాఖకు సంబంధించిన 5 ఫైళ్లు, విదేశాంగ శాఖకు చెందిన 15 ఫైళ్లను బహిర్గతం చేసింది.  జపాన్ కూడా 5 ఫైళ్లలో రెండింటిని బహిర్గతం చేసేందుకు అంగీకరించిదని సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. నేతాజీ స్మారకంతో పాటు మ్యూజియం కూడా నిర్మిస్తామని, పనులు మొదలయ్యాయని తెలిపారు.

 మళ్లీ దర్యాప్తునకు ఆదేశించిన మొరార్జీ
 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని గత ప్రభుత్వాలు నిర్ధారించినప్పటికీ.. నేతాజీ  మరణంపై మరింత దర్యాప్తు చేయాలని 1977లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆదేశించినట్లు మహేశ్ శర్మ వెల్లడించారు.

మరిన్ని వార్తలు