కాంగ్రెస్‌లో కొత్త అనుబంధ సంఘం ఏర్పాటు

25 Apr, 2018 17:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ పేరుతో కొత్త అనుబంధ సంఘంను ఏఐసీసీ ఏర్పాటు చేసింది. దీనికి జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్‌ను రాహుల్‌ గాంధీ నియమించారు. 58 మందితో జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ కొత్త అనుబంధ సంఘంలో ఐదుగురు వైస్ ఛైర్మెన్లను నియమించారు. వైస్ ఛైర్మెన్‌గా తెలుగు రాష్ట్రానికి చెందిన బెల్లయ్య నాయక్‌ అవకాశం దక్కింది. సభ్యులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పి.బాలరాజు, సీతక్క, బలరాం నాయక్, పొద్దం వీరయ్య, రవీంద్ర నాయక్, రేగా కాంతారావ్, ఆత్రం సక్రులు చోటు చేజిక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు