అరుదైన పాము.. ‘హ్యారీపోటర్‌’ పేరు

18 Apr, 2020 16:50 IST|Sakshi

ఇటానగర్‌ : ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ అరుదైన పాము పేరు ‘సలజర్స్‌ పిట్‌ వైపర్‌’. ‘సలజర్‌ స్లితరిన్‌’ అనేది హ్యారీపోటర్‌ సినిమాలోని ఓ క్యారెక్టర్‌. సలజర్‌ క్యారెక్టర్‌ను పోలి ఉన్న కారణంగా ఈ పాముకు ఆ పేరు పెట్టారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అడవుల్లో దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు నేషనల్‌ సెంటర్ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌కు చెందిన జీసన్‌ ఏ అయాజ్‌ మిర్జా, బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీకి చెందిన హర్షల్‌ ఎస్‌ బోషలే, మరో ఇద్దరు దీన్ని కనుగొన్నారు. ( పైసల పరేషాన్‌.. బ్యాంకులకు పరుగులు తీస్తున్న జనం )

సలజర్స్‌ పిట్‌ వైపర్‌
ఈ ఏప్రిల్‌లో విడుదలైన ‘జూసిస్టమాటిక్‌ అండ్‌ ఎవాల్యూయేషన్‌’ మ్యాగజైన్‌లో దీనికి సంబంధించిన వివరాలు బహిర్గతం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘సలజర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో గుర్తించబడ్డ ఐదో అరుదైన పాము. ఈ పాము విషపూరితమైనది. వీపు భాగంలో ఉన్న డిజైన్‌ కారణంగానే దీనికి ఆ పేరు పెట్టాము. ఇది జినస్‌ ట్రిమెరెసారస్‌ లాసపెడెకి వర్గానికి చెందింద’ని తెలిపారు.  ( నాకు నటించడం రాదు: నటుడు )

మరిన్ని వార్తలు