డిలీట్‌ చేసినా మళ్లీ డౌన్‌లోడ్‌ చేయొచ్చు

17 Apr, 2018 03:29 IST|Sakshi

న్యూఢిల్లీ: వాట్సాప్‌లో మనకు ఇతరులు పంపిన ఫొటోలు, వీడియోలు తదితరాలను మనం ఒకసారి డిలీట్‌ చేస్తే వాటిని మళ్లీ డౌన్‌లోడ్‌ చేయడం ఇప్పటివరకు సాధ్యమయ్యేది కాదు. అయితే ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం వాట్సాప్‌ కొత్తగా తెచ్చిన ఫీచర్‌తో ఇది సాధ్యమే. వాట్సాప్‌లో ఎవరైనా పంపిన ఫైళ్లను ఫైల్‌ మేనేజర్‌లోకి వెళ్లి డిలీట్‌ చేసినా.. మళ్లీ ఆ ఫైల్‌ పంపిన వారి చాట్‌ విండోలోకి వెళ్లి వాటిని మరోసారి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్‌ వర్షన్‌ 2.18.106 లేదా ఆపై వర్షన్లలో ఈ అప్‌డేట్‌ ఉన్నట్లు సమాచారం. గతంలో వాట్సాప్‌లో ఒకరు పంపిన ఫైల్‌ను గ్రహీత డౌన్‌లోడ్‌ చేయగానే ఆ ఫైల్‌ వాట్సాప్‌ సర్వర్ల నుంచి డిలీట్‌ అయిపోయేది. ఒకవేళ గ్రహీత ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయకపోతే గరిష్టంగా 30 రోజుల వరకు అది సర్వర్లలో ఉండేది. ఇకపై గ్రహీత ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసినా సరే అది వాట్సాప్‌ సర్వర్ల నుంచి డిలీట్‌ అవ్వదు. కాబట్టి వినియోగదారులు ఆ ఫైల్‌ను తమ ఫోన్‌లో పొరపాటున డిలీట్‌ చేసినా మరోసారి డౌన్‌లోడ్‌ చేసుకోగలరు.     

మరిన్ని వార్తలు