లాక్‌డౌన్‌ కాలంలో విస్తృత వాడుకలోకి... !

19 May, 2020 13:37 IST|Sakshi

కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తున్న పేరు ఇది. మనం ఏ విషయం గురించి మాట్లాడాలన్న కరోనాకి ముందు కరోనాకి తరువాత అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కరోనా వల్ల కేవలం ఆర్ధిక పరంగా, మార్కెట్ల పరంగా మాత్రమే కాదు, మనుషులు వాడే పదాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. కరోనా కారణంగా చాలా పదాలు ఇప్పుడు డిక్షనరీలో చేరాయి. 2020 సంవత్సరంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పదాలు ఏంటి? గూగుల్‌లో ఎక్కువ మంది ఏ పదాలను వెతుకుతున్నారో చూద్దాం. వైద్య పరిభాషకి సంబంధించి మాస్క్‌లు, పీపీఈ కిట్లు లాంటి పదాలను ఎక్కువగా వెతుకుతున్నారు. అలాగే ఎక్కువగా ఉపయోగిస్తున్న పదాల విషయానికి వస్తే (టిక్టాక్కు షాకివ్వనున్న మ్యూజిక్ కంపెనీలు!)

సోషల్‌ డిస్టెన్సింగ్‌ (సామాజిక దూరం): మనకి చిన్నప్పుడు స్కూల్‌లో అసెంబ్లీ జరిగే సమయంలో ప్రతి ఒక్కరు చేయి అంత దూరంలో ఉండాలి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు కేవలం అసెంబ్లీ సమయంలో మాత్రమే కాకుండా ప్రతి చోట దానినే తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా మహమ్మారి కట్టడికి మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం చాలా అవసరం.

(వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్!)

గ్లోబల్‌ పండమిక్‌ (మహమ్మారి): ఒక వ్యాధి ప్రపంచమంతా వ్యాపిస్తూ, అనుకున్నదాని కన్నా దాని తీవ్రత ఎక్కువగా ఉండి ఊహించనదాని కన్నా ఎక్కువ మంది ఆ వ్యాధి బారిన పడుతుంటే దానిని మహమ్మారిగా వ్యవహరిస్తారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్లాటన్‌ ది కర్వ్‌ : ఈ పదాన్ని వ్యాధిని వేగంగా విస్తరించిన తరువాత వ్యాధిని నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, వ్యాధిన పడిన వారి సంఖ్య రోజు రోజు తగ్గించడం, మెరుగైన వైద్యం అందిస్తూ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాము. 

ఇన్‌ఫోడెమిక్‌: ఒక విషయానికి సంబంధించి అధికంగా సమాచారం లభించడాన్ని ఇన్‌ఫోడెమిక్‌ అంటాం. ఇప్పుడు మనం సోషల్‌ మీడియాలో, వాట్సప్‌లో అన్నింటిలో కరోనాకు సంబంధించిన సమాచారాన్నే ఎక్కువగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఫేక్‌ న్యూస్‌లు కూడా ఎక్కువగానే పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తాము. 

డబ్ల్యూఎఫ్‌హెచ్‌: వర్క్‌ ఫ్రం హోం (ఇంటి నుంచి పని చేయడం) ఇప్పుడు ఈ పదం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పించాయి. అందుకే ఇప్పుడు ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది.

లాక్‌డౌన్‌: ఈ పదానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిని అవసరం లేదు. కరోనాను కట్టడి చేయడానికి అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. ఆయా దేశాల్లోని చట్టాలకు అనుగుణంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో అన్ని కార్యకలాపాలతో పాటు ప్రజలు ఎక్కడ వారక్కడే స్ధంబించిపోయారు. ఈ కరోనా కాలంలో మొదటి నుంచి వినిపిస్తూ ప్రజలని భయపెడుతున్న పదం లాక్‌డౌన్‌.

క్వారంటైన్‌ అండ్‌ చిల్‌: దీని అర్ధం కరోనా సమయంలో విధించిన అన్ని నిబంధనలను అనుసరిస్తూ ఇంట్లో సౌకర్యవంతంగా ఉండటం. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మందికి విశ్రాంతి దొరికింది. వారందరికి తమ తమ కుటుంబాలతో గడపడానికి ఒక అవకాశం లభించింది.

మరిన్ని వార్తలు