కొత్త జంట‌కు క‌రోనా; గ్రామానికి సీల్‌

26 Apr, 2020 14:00 IST|Sakshi

లక్నో: పెళ్లి చేసుకున్న జంట‌కు క‌రోనా షాకిచ్చింది. తాజా ప‌రీక్ష‌ల్లో వ‌ధూవ‌రులిద్ద‌రికీ క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో కుటుంబ స‌భ్యులను క్వారంటైన్‌కు త‌ర‌లించా‌రు. ఆ కొత్త జంట‌ను రాజ‌స్థాన్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మ‌రోవైపు వివాహానికి వేదిక‌గా నిలిచిన అజంఘ‌డ్‌లోని చ‌త్త‌ర్‌పూర్ గ్రామానికి అధికారులు సీల్ వేశారు. వివ‌రాలు.. రాజ‌స్థాన్‌కు చెందిన యువ‌కుడు ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని చ‌త్త‌ర్‌పూర్ యువ‌తిని మార్చి 23న‌ వివాహమాడాడు. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల వారు అదే గ్రామంలో చిక్కుకుపోగా ఏప్రిల్ 14న అక్క‌డ నుంచి రాజ‌స్థాన్‌కు ప‌య‌నమయ్యారు. (లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణ ఎలా?)

నాలుగు రోజులు ప్ర‌యాణించిన‌ అనంత‌రం వారు రాజ‌స్థాన్ స‌రిహ‌ద్దుకు చేరుకున్నారు. అయితే స‌రిహ‌ద్దు సిబ్బంది వారిని అక్క‌డే ఆపేసి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఇద్ద‌రికీ పాజిటివ్ అని తేలింది. ‌దీంతో అప్ర‌మ‌త్తమైన అధికారులు పెళ్లి జ‌రిగిన చ‌త్త‌ర్‌పూర్ గ్రామాన్ని మూసివేశారు. వారి కుటుంబీకుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించారు. గ్రామ‌స్థుల‌కు స్క్రీనింగ్ నిర్వ‌హించ‌డంతోపాటు ఆ ప్రాంతాన్నంత‌టినీ శానిటైజింగ్ చేయ‌నున్నారు. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు