స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే!

15 Dec, 2018 15:37 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులోని వివాదాస్పద స్టెరిలైట్ కర్మాగారాన్ని మళ్లీ తెరవాలంటూ జాతీయ గ్రీన్ ట్రిబునల్ శనివారం ఆదేశాలు ఇచ్చింది. తుత్తుకుడిలోని వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్టెరిలైట్ ప్యాక్టరీని మూసివేస్తూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జాతీయ గ్రీన్ ట్రిబునల్ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్‌ కర్మాగారాన్ని తెరువాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీచేసింది. ట్రిబ్యునల్‌ ఆదేశాలపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు