బెంగాల్‌ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

2 Apr, 2018 20:08 IST|Sakshi

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్ర మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. శ్రీరామనవమి వేడుకల్లో చోటు చేసుకున్న హింసకు గల కారణాలను తెలుపాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. గత వారం శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌‌, అసన్‌సోల్‌ ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. హింస చేలరేగిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టాల్సిందింగా ఆ రాష్ట్ర డీజీపీని, ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా అందులో పేర్కొంది.

మరోవైపు ఈ ఘర్షణలు... తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తున్నాయి. ర్యాలీల పేరుతో రాముడి పేరును చెడగొడుతున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాఖ్యానించిన సంగతి తెలిసిందే.  ఈ వాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందిస్తుంది. తాజాగా షాన్‌వాజ్‌ హుస్సేన్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బీజేపీ బృందం ఆదివారం హింస తలెత్తిన ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా హుస్సేన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ... పెద్ద ఎత్తున అలర్లు జరుగుతున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా