ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

15 Jul, 2019 18:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ఎన్‌ఐఏకు మరిన్ని అధికారాలు కల్పించే విధంగా సవరణ బిల్లును రూపొందించారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కూడా బిల్లులో పొందుపరిచారు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శల నడుమ ఈ బిల్లు ఆమోదం పొందింది. సవరణ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన్పటికీ.. బిల్లు సునాయాసంగా పాసయ్యింది. తదుపరిగా రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టంగా మారనుంది.

కాగా చర్చలో భాగంగా సభలో విపక్షాల ఆరోపణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో లా అండ్‌ ఆర్డర్‌ను పరిరక్షించడానికే ఎన్‌ఐఏను సవరించామని వివరించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోటా చట్టం రద్ద చేసిన అనంతరం దేశంలో ఉద్రదాడులు మరింత పెరిగాయని విమర్శించారు. కేవలం ఓట్ల కోసం పోటా చట్టాన్ని రద్దు చేశారని, ఆ తరువాత ముంబై దాడులు జరిగాయని గుర్తుచేశారు. దాని స్థానంలోనే 2009లో ఎన్‌ఐఏ చట్టం చేశారని తెలిపారు. కీలకమైన బిల్లుకు పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని షా విజ్ఞప్తి చేశారు. మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎప్పటికీ చట్టాలను దుర్వినియోగం చేయదని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజస్తాన్‌​ హైకోర్టులో ఆ పదాలు నిషేధం

సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

‘కళంకిత అధికారులపై వేటు’

అప్పటివరకు ప్రశాంతం.. అంతలోనే బీభత్సం

ఆ షాక్‌ నుంచి తేరుకోని పాకిస్తాన్‌

హిమాచల్‌ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

అరగంట టైం వేస్ట్‌ అవుతోంది.. చెట్లు నరికేయండి

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’

కుప్పకూలిన జాయ్‌ రైడ్‌ : ఇద్దరు మృతి

సినిమా పోస్టర్‌ నిజమై నటుడు మృతి!

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

ల్యాండ్‌ మాఫీయాలో ఎంపీ హస్తం

కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి

ఈనాటి ముఖ్యాంశాలు

దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి

అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్‌?

రొమాన్స్‌ పేరుతో వ్యాపారి నిలువు దోపిడీ

మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి

బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు

‘బెస్ట్‌’  బస్సు నడపనున్న ప్రతీక్ష

భార్య పోలీస్‌ డ్రెస్‌ ప్రియురాలికిచ్చి..

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!