ఎన్‌ఐఏకు పుల్వామా ఉగ్రదాడి కేసు

20 Feb, 2019 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయదర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. హోంశాఖ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. ఘటనాస్థలి నుంచి ఇప్పటికే ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్‌ బృందం మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఫిబ్రవరి 14న సీర్పీఎఫ్‌ జవాన్ల వ్యాన్‌పై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌ ప్రమేయం ఉందని భారత ప్రభుత్వం ఆరోపిస్తుండగా మరోవైపు పాక్‌ మాత్రం తమకెలాంటి సంబంధం లేదంటోంది.

మరిన్ని వార్తలు