జకీర్‌కు 78బ్యాంకు ఖాతాలు.. కోట్ల రియల్‌ ఎస్టేట్‌

19 Jan, 2017 20:04 IST|Sakshi
జకీర్‌కు 78బ్యాంకు ఖాతాలు.. కోట్ల రియల్‌ ఎస్టేట్‌

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాంమత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఐఆర్‌ఎస్‌) గురించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విస్తుపోయే విషయాలు చెప్పింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జకీర్‌ సంస్థ దాదాపు 100 కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టిందంట. అలాగే, ప్రస్తుతం జకీర్‌ నాయక్‌కు 78 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటన్నింటిపై తాము నిఘా పెట్టామని, పరిశీలిస్తున్నామని చెప్పింది.

జకీర్‌ సోదరి నైలా నౌషాద్‌ నూరానీతో సహా ఇప్పటి వరకు మొత్తం 20 సంస్థలకు చెందిన వ్యక్తులను ప్రశ్నించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. పన్ను చెల్లింపుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకొని  విశ్లేశిస్తున్నట్లు పేర్కొంది. ఒక్కసారి మొత్తం వ్యవహారం పరిశీలన పూర్తయ్యాక జకీర్‌ నాయక్‌ను ప్రశ్నించేందుకు సమన్లు పంపించే విషయం చెబుతామని అన్నారు. గత ఏడాది(2016) నవంబర్‌ 19న ముంబయిలోని జకీర్‌ నాయక్‌ చెందిన ఐఆర్‌ఎఫ్‌ ప్రాంగణంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరోక్షంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఐఆర్‌ఎఫ్‌పై ఆరోపణలు కూడా గట్టిగా వచ్చాయి.

మరిన్ని వార్తలు