'నా కూతురికి అబార్షన్‌ చేయించాడు'

21 Jul, 2016 09:01 IST|Sakshi
'నా కూతురికి అబార్షన్‌ చేయించాడు'

తిరువనంతపురం: మాజీ ప్రేమికుడు బలవంతం చేయడంతోనే తన కుమార్తె మతం మారిందని ఫాతిమా అలియాస్ నిమిషా తల్లి బిందు ఆరోపించారు. సయిద్ రెహ్మాన్ తన కూతుర్ని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని పేర్కొన్నారు. కేరళ నుంచి ఐసిస్ చేరడానికి వెళ్లారని భావిస్తున్న వారిలో ఫాతిమా కూడా ఉంది. తన భర్త ఎజా అలియాస్ బెక్స్టన్ తో కలిసి ఆమె కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది.

ఈ నేపథ్యంలో ఫాతిమా తల్లి బిందు బుధవారం మీడియా ముందుకు వచ్చారు. పుదుచ్చేరి మెడికల్ కాలేజీ విద్యార్థి అయిన రెహ్మాన్... నిమిషాను ప్రేమలోకి దించాడని బిందు తెలిపారు. 2013లో నిమిషాను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని, ఆమెకు గర్భస్రావం చేయించాడని ఆరోపించారు. రెహ్మాన్ తో విడిపోయిన తర్వాత కూడా ఆమె ముస్లింగానే కొనసాగిందని వెల్లడించారు. రెహ్మాన్ తో సంబంధం గురించి తమకు ఎప్పుడు చెప్పలేదని, అతడి ద్వారానే ఈ విషయాలు తెలిశాయన్నారు. తమ దగ్గరకు వచ్చినప్పుడు హిందువుగానే ఉండేదన్నారు. నిమిషాను కలవడానికి పలుమార్లు కలవడానికి రెహ్మాన్ ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదన్నారు.

'నా కుమార్తె కనిపించకుండా పోవడానికి కారణం అతడే. ఆమె ఎక్కడ ఉందో తెలియడం లేదు. నిమిషా అదృశ్యమైన విషయం తెలిసి రెహ్మాన్ నన్ను సంప్రదించాడు. తనను క్షమించాలని కోరాడు. నిమిషా లాగే ఇద్దరుముగ్గురు యువతులు కనిపించకుండా పోయారని చెప్పాడ'ని బిందు తెలిపారు.

మరిన్ని వార్తలు