రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికులకు గాయాలు

6 Feb, 2016 17:08 IST|Sakshi

జమ్మూ:  భారత సైనికులు ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు ప్రమాదం బారిన పడటంతో తొమ్మిది మంది గాయపడ్డారు. శనివారం జమ్మూ కశ్మీర్ లోని నాగ్రోటా జిల్లా పరిసర ప్రాంతంలో  ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి కిందికి జారిపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన సైనికులను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు