కోల్‌కతాలో నిపా వైరస్‌ కలకలం

30 May, 2018 15:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : కోల్‌కతా మహానగరంలో కేరళకు చెందిన సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందతూ ప్రాణాలు విడిచారు. శీను ప్రసాద్‌ ఫోర్ట్‌ విలియం కోటలో పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు.

చికిత్సకు స్పందించని ప్రసాద్‌ సోమవారం తుది శ్వాస విడిచారు. కాగా, ప్రసాద్‌ నిపా వైరస్‌ సోకి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రసాద్‌ శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి వ్యాధి నిర్ధారణకు పంపారు.

భారతదేశంలో నిపా వైరస్‌ను గుర్తించగల సామర్ధ్యం ఉన్న ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది. కాగా, కేరళలో ఇప్పటికి నిపా వైరస్‌తో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు