నీరవ్‌ మోదీకి భారీ షాక్‌

5 Dec, 2019 12:43 IST|Sakshi

న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(48)కి ముంబైలోని స్పెషల్‌ కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్‌ఈవో)గా నీరవ్‌ను గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద ముంబైలోని అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్‌ఏ) కోర్టు అతడిని ఆర్థిక నేరగాడిగా పేర్కొంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను రూ.14వేల కోట్ల మేర మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మోదీ లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అప్పగించాలంటూ భారత్‌ యూకేను కోరుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌లో అరెస్టైన నీరవ్‌.. బెయిల్‌ కోసం పిటిషన్‌ పెట్టుకోగా నాలుగుసార్లు తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్‌ జైలుకు తరలించారు. 

ఈ క్రమంలో డిసెంబర్‌ 4న వీడియో లింక్‌ ద్వారా అతడిని కోర్టు విచారించనుందని వార్తలు వెలువడ్డాయి. కాగా నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను భారత్‌ తరపున వాదిస్తున్న న్యాయవాది లండన్‌ కోర్టులో సవాల్‌ చేశారు. ఇక భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్‌ మోదీ బెదిరించిన విషయం తెలిసిందే. కాగా భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ముంబై కోర్టు ఆర్థిక నేరస్తుడిగాఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన రెండో వ్యక్తిగా నీరవ్‌ నిలిచాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కీలక రేట్లు యథాతథం..

‘దిశ’ ఘటనతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం

హైదరాబాద్‌లో అంతర్జాతీయ బ్రాండ్ల టీవీల అసెంబ్లింగ్‌

మహిళలకు ‘మై హెల్త్‌ ఉమెన్‌ సురక్షా’ ప్లాన్‌

జనవరిలో అంతర్జాతీయ సదస్సు

డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి కేన్సర్‌ ఇంజక్షన్‌

వాణిజ్య ఒప్పంద లాభాలు

‘ఉజ్జీవన్‌’ ఐపీఓ... అదుర్స్‌

జియో బాదుడు.. 39% పైనే

సీఎస్‌బీ బ్యాంక్‌ లిస్టింగ్‌.. భేష్‌

టాటా మోటార్స్‌ కార్ల ధరలు పెంపు..

కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు

డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష..

నల్లగొండ కుర్రాడికి మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌

ఇక చిన్న మదుపరికీ బాండ్లు!

సరిలేరు ‘సుందర్‌’కెవ్వరు..!

జియో కొత్తప్లాన్స్‌ ఇవే..ఒక బంపర్‌ ఆఫర్‌

ట్రేడ్‌ డీల్‌ అంచనాలు : మార్కెట్ల రీబౌండ్‌

మరింత సన్నటి ‘ఐప్యాడ్స్‌’

బ్యాంకుల రీబౌండ్‌, 200 పాయింట్లు జంప్‌

ఆర్థిక సంక్షోభానికి ఇవి సంకేతాలు కావా!?

సత్తా చాటిన సేవల రంగం..

స్టాక్‌ మార్కెట్లకు ట్రేడ్‌ వార్‌ షాక్‌..

సుందర్‌ పిచాయ్‌కు కీలక బాధ్యతలు

ఎన్‌ఎంఆర్‌ కేంద్రానికి ఎఫ్‌డీఏ ఆమోదం

పడేసిన ప్రపంచ పరిణామాలు  

ఆర్‌బీఐ మూడురోజుల విధాన సమీక్ష ప్రారంభం!

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌

రూ.4.91 లక్షల కోట్ల రుణ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆన్‌లైన్‌ గ్రీకు వీరుడు హృతిక్‌!

విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం: హీరోయిన్‌

బిగ్‌బాస్‌: కొట్టుకున్నారు.. ఆపై ఏడ్చాడు!

నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి

డెంగీతో బాధపడుతూ నటించాను..

రొమాంటిక్‌కి గెస్ట్‌