'నిర్భయ దోషికి స్లో పాయిజన్ ఇస్తున్నారు'

25 Jan, 2020 15:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉరిని ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు రోజుకో రకంగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా వినయ్ శర్మకు జైలు అధికారులు స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఆయన తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు.  తన క్లయింటును ఆసుపత్రిలో చేర్పించారని ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వెల్లడించారు. పైగా వినయ్ శర్మకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అందజేయడం లేదన్నారు. శనివారం ఆయన ఈ మేరకు కోర్టుకు దరఖాస్తును అందజేశారు. కేర‌ళ‌, పంజాబ్ బాట‌లో రాజ‌స్తాన్‌..!

దోషులు ఉరి తప్పించుకునేందుకు తప్పుడు పిటిషన్లు వేస్తున్నారని.. వారికి సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చామని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి వినయ్ శర్మ లాయర్ వేసిన పిటిషన్ కొట్టివేశారు. దీంతో ఉరి నుంచి తప్పించుకునేందుకు మెల్లమెల్లగా దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పటికే క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరించగా ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘తీహార్‌’ అధికారులు సహకరించట్లేదు!

>
మరిన్ని వార్తలు