మన దేశానికి ఇది ఎంతో అవమానకరం: వర్మ

1 Feb, 2020 13:36 IST|Sakshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడటంపై వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష పడకుంటా అడ్డుకుంటున్న న్యాయవాది ఏపీ సింగ్‌పై మండిపడుతూ వరుస ట్వీట్లు చేశాడు. ‘మురికి మనిషి ఏపీ సింగ్‌ నీతినియమాలను ఉల్లంఘిస్తే తన కూతురునైనా కాల్చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో చూడండి. ఇది మన సిస్టమ్‌కు ఉరి వేస్తూ అతడు వేసిన ఒట్టు అది. మన దేశానికి ఎంతో అవమానకరం’అంటూ 2013లో ఏపీ సింగ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూ లింక్‌ను షేర్‌ చేశాడు. 

‘అత్యంత క్రూరంగా, అహంకారంతో మన వ్యవస్థను న్యాయవాది ఏపీ సింగ్‌ మార్చుతుంటే.. మన వ్యవస్థ కంటే తెలంగాణ పోలీసులపైనే ప్రజలకు ఎక్కువ నమ్మకం కలుగుతుంది’, ‘నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడనివ్వని ఏపీ సింగ్‌ సవాల్‌ చేస్తున్నాడు. నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం’అంటూ మరో రెండు ట్వీట్లు శనివారం చేశాడు. అయితే శుక్రవారం దోషులకు ఉరిశిక్ష వాయిదా వేస్తూ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన వెంటనే వర్మ ట్విటర్‌ వేదికగా మండిపడిన విషయం తెలిసిందే.  

నాడు నిర్భయ జంతువుల చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురైతే.. నేడు మన వ్యవస్థ చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురవుతోందంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని మీరు ఊహించగలరా మోదీ గారూ. దానిని తెలుసుకోవడం కోసం.. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి’ అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా నిర్బయ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు శిక్ష అమలుకానుండగా.. కొన్ని గంటల ముందు కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వచ్చేవరకు ఉరిశిక్ష అమలు చేయరాదని ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష పదే పదే వాయిదా పడటాన్ని యావత్‌ దేశం జీర్ణించుకోలేకపోతోంది. 

చదవండి:
ఆ కీచకులను వెంటనే ఉరితీయండి: గంభీర్‌

‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా

మరిన్ని వార్తలు