మళ్లీ కోర్టుకెక్కిన నిర్భయ దోషి

26 Jan, 2020 04:09 IST|Sakshi

క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేసిన ముఖేష్‌

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసు దోషి ముఖేష్‌ మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. క్షమాభిక్ష కోరుతూ తాను పెట్టుకుని దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించడాన్ని ముఖేష్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆర్టికల్‌32 కింద క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణపై న్యాయ విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరినట్లు ముఖేష్‌ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్‌ తెలిపారు. 2012 నాటి నిర్భయ అత్యాచారం కేసులో ముఖేష్‌తోపాటు మరో ముగ్గురికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించగా.. వచ్చే నెల ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటలకు శిక్షను అమలు చేయనున్న విషయం తెలిసిందే.

అయితే ఈ లోపుగా దోషుల్లో ఒకరైన ముఖేష్‌ రాష్ట్రపతి  జనవరి 17న తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్‌పై కోర్టుకెక్కారు. తీర్పును సవరించాల్సిందిగా ముఖేష్, అక్షయ్‌ కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించగా, పవన్‌ గుప్తా, వినÄŒæ శర్మలు సవరణ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంది. తీహార్‌ జైలు అధికారులు తమకు అవసరమైన దస్తావేజులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, దీనివల్ల తాము క్షమాభిక్ష, సవరణ పిటిషన్లు దాఖలు చేయలేకపోతున్నామని ఆరోపిస్తూ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఒకటి శనివారం కొట్టివేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా