ఇందిరా జైసింగ్‌ విజ్ఞప్తిపై నిర్భయ తల్లి స్పందన

18 Jan, 2020 10:21 IST|Sakshi

న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై నిర్భయ తల్లి ఆగ్రహం

న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌​ చేసిన విజ్ఞప్తిపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. ఇందిరా అలాంటి సలహా ఎలా ఇవ్వగలరని మండిపడ్డారు. ఇలాంటి వాళ్ల వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన  నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాను నిర్భయ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. అయితే ఉరిశిక్షకు కూడా తాను పూర్తి వ్యతిరేకమని ఇందిరా జైసింగ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు.. రాజీవ్‌ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి కూడా నలుగురు దోషులను క్షమించాలని ట్విటర్‌ వేదికగా ఆమె విజ్ఞప్తి చేశారు.  

ఈ విషయంపై స్పందించిన నిర్భయ తల్లి... ‘నాకు ఇలాంటి సలహా ఇవ్వడానికి అసలు ఇందిరా జైసింగ్‌ ఎవరు? దోషులను ఉరి తీయాలని దేశమంతా కోరుకుంటోంది. నిజానికి ఇందిరా లాంటి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదు. అసలు ఆమె ఇంత ధైర్యం ఎలా చేయగలిగారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆమెను చాలాసార్లు నేరుగా కలిశాను. కానీ ఎప్పుడూ కూడా నా క్షేమ సమాచారాల గురించి ఆమె అడగలేదు. కానీ ఈరోజు దోషుల తరఫున మాట్లాడుతోంది. ఆమె లాంటి వాళ్లు రేపిస్టులకు మద్దతు పలుకుతూ జీవనోపాధి పొందుతూ ఉంటారు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా?

చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం

తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని

మరిన్ని వార్తలు