నిర్మల ముందు పెను సవాళ్లు!

28 May, 2014 18:09 IST|Sakshi
నిర్మల ముందు పెను సవాళ్లు!

బంగారం దిగుమతులపై నియంత్రణలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై మ్యాట్ విధింపు, ఉత్పాదక రంగంలో గణనీయంగా పడిపోయిన ఉత్పత్తి, కార్మిక చట్టాలు, భూసేకరణలో సమస్యలు ... ఇలా అనేకానేక సమస్యలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందు కొలువుదీరాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్కు ఆ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ సమస్యలన్నింటినీ తెలిపారు. దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాల పరిస్థితిని క్షుణ్ణంగా వివరించారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ), వాణిజ్య శాఖ కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా, ఉత్పాదక రంగంలో వృద్ధి ఆగిపోవడం, అరాచకంగా ఉన్న కార్మిక చట్టాలు, అనుమతులు పొందడంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల గురించి డీఐపీపీ కార్యదర్శి అమితాబ్ కాంత్ మాట్లాడారు. పారిశ్రామిక లైసెన్సులు ఇవ్వడంలో ఆలస్యం తదితర విషయాల గురించి కూడా ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు