రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్‌కు బీమా

5 Jul, 2019 11:50 IST|Sakshi

 రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్‌కు బీమా సౌకర్యం- ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

 ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే బీమా

ప్రభుత్వ రంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు 

 టాయిలెట్‌, విద్యుత్‌ లాంటి కనీస సౌకర్యాలు

114 రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ తన  తొలి బడ్జెట్‌ ప్రసంగంలో   తన వాగ్ధాటితో ఆకట్టుకుంటున్నారు.   సంస్కృతం, ఉర్దూ  కొటేషన్లతో.. బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. కార్య పురుష కరే న లక్ష్యం సంపదయతె’, ‘యకీన్‌ హో తో కోహి రస్తా నిఖల్‌తా హై, హవా కీ ఉత్‌ భి లే కర్‌ చిరాగ్‌ జల్తా హై’ అని చాణక్య, ఉర్దూ సూక్తులను ఉటంకించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  బీజేపీ సర్కార్‌ అభివృద్ధి కార్యక్రమాలపై   అనర్గళంగా ప్రస్తావిస్తున్నారు.  దేశ ఆర్థిక వ్యవస్థ  1 ట్రిలియన్‌ డా లర్ల స్థాయికి చేరడానికి 55 ఏళ్లు పడితే.. కేవలం అయిదేళ్లలో  తమ ప్రభుత్వం  మరో 1 ట్రిలియన్ల డాలర్లను పెంచుకున్నామని, అలాగే  2020 ఆర్థిక సంవత్సరానికి 3 ట్రిలయన్లకు చేరతామన్నామని స్పష్టం చేశారు.  అంతేకాదు  5 ట్రలియన్‌ డాలర్ల స్థాయికి చేరడమే తమ లక్ష్యమని   ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధింస్తామనే   విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.  ప్రజలు అందించిన అఖండ విజయడంతో మరింత ఎత్తుకు ఎదుగనున్నామని, ఎన్నో  అద్భుతాలు సంభవించనున్నాయని చెప్పుకొచ్చారు.  నవభారత నిర్మాణానికి ప్రధాన నరేంద్రమోదీ నేతృత్వంలోని సర్కార్‌ కట్టుబడి ఉందని  చెప్పారు.

రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్‌లకు బీమా సౌకర్యం కల్పిస్తామని, కేవలం బ్యాంక్‌ అకౌంట్‌,  ఆధార్‌ కార్డు ఉన్న తక్కువ ఆదాయం ఉన్న వారికి ఈ బీమా సౌకర్యాన్ని అందిస్తామన్నారు. అలాగే  జాతీయ హౌసింగ్ రెంటల్ విధానాన్ని ప్రకటించారు . ప్రభుత్వ రంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థికమంత్రి   ప్రకటించారు. 2022నాటికి  ప్రధానమంత్రి ఆవాస్‌  యోజన్‌ పథకం కింద అందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అర్హులైన వారికి 1.95కోట్ల ఇళ్లను ఇస్తామన్నారు. టాయిలెట్‌, విద్యుత్‌ లాంటి కనీస సౌకర్యాలతో వీటిని నిర్మిస్తామని , కేవలం 114 రోజుల్లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని  పూర్తి చేస్తామన్నారు.  బడ్జెట్‌ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు