దేశ ఆర్థిక సర్వేలో కీలక విషయాలు

4 Jul, 2019 12:04 IST|Sakshi

రానున్న సంవత్సరం చమురు ధరలు తగ్గుతాయి

జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది

2019 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన ఎకనమిక్‌ సర్వే 2019ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు తగ్గుతాయని ఎకనమిక్‌ సర్వే అంచనా వేసింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7శాతంగా ఉండనుందని పేర్కొంది. 2018 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2019లో ద్రవ్యలోటు 6.4శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిందని సర్వే అంచనా వేసింది. 2025 నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగాలంటే.. 8శాతం జీడీపీ వృద్ధిరేటుతో ముందుకు సాగాల్సిన అవసరముందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు