కృత్రిమ మేథతో సమూల మార్పులు

25 Jan, 2019 12:55 IST|Sakshi

దావోస్‌ : కృత్రిమ మేథ (ఏఐ)తో మానవ జీవితంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అన్నారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పెనుప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామన్నారు.

మెరుగైన డేటా ఇవ్వగలగడం, వైద్యులకు నివేదికలు, చిత్రాలు పంపడం, విద్యలో వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించడం వంటి ఎన్నో ఊహించని మార్పులు ఏఐతో అనుభవంలోకి వస్తాయన్నారు. కృత్రిమ మేథను పౌరుల జీవితం మెరుగయ్యేందుకు శాస్త్రీయ కోణంలో అమలు చేయాలని సూచించారు. అందరి ప్రయోజనం కోసం ఏఐని వాడుకోవడంపై దృష్టిసారించాలని, దీనిపై మితిమీరిన ఆంక్షలు వినూత్న ఆవిష్కరణలపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు