నీతి ఆయోగ్‌లో కోవిడ్‌-19 కలకలం

1 Jun, 2020 13:59 IST|Sakshi

ఢిల్లీలో వైరస్‌ ఉధృతి

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని నీతిఆయోగ్‌ కార్యాలయంలో ఓ అధికారికి కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో కార్యాలయంలో మూడో అంతస్ధును సోమవారం మూసివేశారు. ఈ ఫ్లోర్‌లో శానిటైజేషన్‌ చేపడుతున్నారు. ఇక ఐసీఎంఆర్‌లో పనిచేసే ఓ శాస్త్రవేత్తకూ కరోనా వైరస్‌ సోకింది. కాగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు గత వారం నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షలో పాజిటివ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారు పనిచేసే డివిజన్లలోని ఉద్యోగులందరినీ 14 రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాలని, ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసులు 19,000కు చేరువ కాగా, మహమ్మారి బారినపడి 416 మంది మరణించారు.

చదవండి : పదును రెక్కలు

>
మరిన్ని వార్తలు