కోవిడ్‌-19 : నీతిఆయోగ్‌ కీలక సూచనలు..

23 Apr, 2020 18:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 తీవ్రత వృద్ధులపై అధికంగా ఉంటుందని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని నీతిఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ సూచించారు. కోవిడ్‌-19 తీవ్రత, మరణాల రేటు వయసు పైబడిన వారిలో అధికంగా ఉంటుందని గణాంకాలు వెల‍్లడిస్తున్న క్రమంలో ఎట్టిపరిస్ధితుల్లో పెద్దలను మనం కాపాడుకోవాల్సి ఉందని కరోనా వ్యాప్తి కట్టడికి ఏర్పాటైన కమిటీకి నేతృత‍్వం వహిస్తున్న పాల్‌ అన్నారు. సీనియర్‌ సిటిజన్ల బాగోగులపై మనం ఈ సమయంలో ప్రత్యేకంగా దృష్టిసారించాలని, కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో వారిని జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రజలు చ్యవన్‌ప్రాశ్‌, తులసి, దాల్చినచెక్క, మిరియాలను తీసుకోవాలని సూచించారు. కాగా కరోనా వ్యాప్తితో భారత్‌ ప్రస్తుతం సంక్లిష్ట సవాల్‌ను ఎదుర్కొంటోందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు.

చదవండి : కోవిడ్‌-19 : అధిక మరణాలు అందుకే..

మరిన్ని వార్తలు