కరోనా పుట్టుకపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు 

13 May, 2020 20:34 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ పుట్టకకు సంబంధించి కేంద్ర చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌‌మ‌ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సహాజ సిద్దమైన వైరస్‌ కాదని.. అది ల్యాబ్‌ నుంచి పుట్టకొచ్చిందని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో చిన్న, మద్య తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై స్పందించిన గడ్కరీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అనుకూలతలు సృష్టించడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. (చదవండి : భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్‌ ప్రెస్‌మీట్‌‌)

అలాగే ప్రతి ఒక్కరు కరోనాతో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలని గడ్కరీ అన్నారు. ఎందుకంటే కరోనా సహజ సిద్ధంగావ వచ్చిన వైరస్‌ కాదని.. ఇది ల్యాబొరేటరీ నుంచి వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తేనే కరోనా భయాన్ని అంతం చేసి, సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. మనం కరోనాతో పాటు, ఆర్థిక పరిస్థితులపై కూడా పోరాడాల్సి ఉంటుందన్నారు. మనది పేద దేశం అని.. నెల నెల లాక్‌డౌన్‌ పొడిగించలేమని తెలిపారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3లక్షల రుణాలు ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి : లాక్‌డౌన్‌ 4.0 : మోదీ కీలక భేటీ)

అయితే చాలా కాలంగా కరోనా చైనాలోని ఓ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. అగ్రరాజ్యం అమెరికాతోపాటుగా చాలా దేశాలు ఈ విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. భారత్‌ మాత్రం ఈ అంశంపై సమన్వయం పాటిస్తూ వస్తోంది. అయితే తొలిసారిగా కరోనా ల్యాబ్‌ నుంచి వచ్చిందని కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

>
మరిన్ని వార్తలు