‘నితీష్‌జీ కూటమిలో చేరండి’

4 Jun, 2019 10:40 IST|Sakshi

పట్నా : కేంద్ర మంత్రివర్గంలో బెర్తులపై బీజేపీ పట్ల కినుక వహించిన బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను తిరిగి మహాకూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నితీష్‌ కుమార్‌ మహాకూటమి గూటికి చేరాలని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ ఆహ్వానించింది. నితీష్‌ కుమార్‌ను బీజేపీ అవమానిస్తున్న క్రమంలో బీజేపీయేతర శక్తుల పునరేకీకరణకు ఇదే సరైన సమయమని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘ్‌వంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల నుంచి పార్టీకి ఒకరి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న కాషాయ పార్టీ నిర్ణయంతో నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక‍్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోదని నితీష్‌ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బిహార్‌లో 17 స్ధానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 16 స్ధానాల్లో గెలుపొందడంతో కేంద్ర క్యాబినెట్‌లో ఎక్కువ మందికి చోటు దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు ఆశించినా ఆ మేరకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నితీష్‌ కంగుతున్నారు. ఎన్డీయేలో అంతా బాగానే ఉందని వ్యాఖ్యానించిన నితీష్‌ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగైనా జరగవచ్చని పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు