చెట్లకు రాఖీలు కట్టిన సీఎం, డిప్యూటీ సీఎం

7 Aug, 2017 17:16 IST|Sakshi
చెట్లకు రాఖీలు కట్టిన సీఎం, డిప్యూటీ సీఎం

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ రక్షా బంధన్‌ను వినూత్నంగా, కొంత సందేశాత్మకంగా జరుపుకున్నారు. వారిద్దరు పట్నాలో మొక్కలకు రాఖీలు కడుతూ సందడిగా కనిపించారు. తాము చెట్లకు రాఖీ కట్టిన ఉద్దేశం ప్రజలు వాటిని సంరక్షించాలని పిలుపునివ్వడమేనని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా అభివృద్ది చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నట్లు తెలిపారు.

ఎప్పటిలా మాదిరిగా తెల్లటి కుర్తా పైజామాలో వచ్చిన నితీష్‌ కుమార్‌ 'మొక్కలను సంరక్షించాలని చెప్పేందుకు ఇది (మొక్కలకు రాఖీ కట్టడం) ఒక సంకేతం. హరితవనం పెంచాలని చెప్పడం దీని ఉద్దేశం. ఇది పర్యావరణానికి అత్యంతముఖ్యమైనది' అని ఆయన చెప్పారు. 2001 నుంచి తాను రాఖీలు చెట్లకు కడుతున్నానని తెలిపారు. తన సందేశాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకున్నారని, తమ రాష్ట్రంలో గ్రీనరీ కూడా బాగా పెరిగిందని తెలిపారు. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు