రాసలీలల వీడియోలో ఉన్నది నిత్యానందే....

22 Nov, 2017 13:41 IST|Sakshi

మళ్లీ నిత్యానందకు కష్టాలు

టేపుల్లో ఉన్నది నిత్యానందేనని తేల్చిన ఫోరెన్సిక్‌

గతంలో రంజితతో నిత్యానందతో కలిసి ఉన్న వీడియోలు హల్‌చల్‌

సాక్షి, న్యూఢిల్లీ : వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. తన అనుంగు శిష్యురాలు రంజితతో కలిసి సన్నిహితంగా...  వీడియో టేపులలో ఉన్నది స్వామి నిత్యానందేనని ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ స్పష్టం చేసింది. దీంతో ఈ సాములోరు మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా నటి రంజితతో కలిసి ఉన్న రాసలీలల వీడియోల్లో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్‌ జరిగిందంటూ ఇప్పటివరకూ నిత్యానంద వాదిస్తూ వచ్చారు. అయితే సీడీల్లో ఉన్నది నిత్యానందేనని ధ్రువీకరిస్తూ... ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చిన ఓ నివేదిక బుధవారం వెలుగులోకి వచ్చింది.

2010లో స్వామి నిత్యానంద రాసలీలల సీడీని ఆయన కారు డ్రైవర్‌ లీక్‌ చేయడంతో... ఆ దృశ్యాలు మీడియాతో పాటు, సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌  చేసిన విషయం తెలిసిందే. అయితే తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపణలు కూడా చేశారు.

కాగా ఇప్పటికే నిత్యానందపై పలు కేసులు నమోదు అయిన విషయం విదితమే. అంతేకాకుండా నిత్యానంద తనపై అత్యాచారం చేశారంటూ ఆరతీరావ్‌ అనే శిష్యురాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2010 సంవత్సరంలో ఆయనపై రేప్‌ కేసు నమోదు అయింది.  తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని,  అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకూడదన్న నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలకు ఆయన అంగీకరించకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది కూడా.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా