పెళ్లిలో మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరి: కర్ణాటక ప్రభుత్వం

15 May, 2020 17:06 IST|Sakshi

బెంగళూరు: పెళ్లి అంటే ఒకప్పుడు బంధువుల హడావుడి.. డీజే సందడి, మందు-విందు కనిపించేవి. కానీ కరోనా దెబ్బతో ఇలాంటి వేడుకల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే ఇలాంటి వేడుకల మీద అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాల్లో మందుకు అనుమతిలేదని.. 50 మందికి మించి ఈ వేడుకలకు హాజరు కాకుడదని తెలియజేసింది. ఈ నెల 17న దేశవ్యాప్తంగా మూడో దశ లాక్‌డౌన్‌ ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.
(మాస్క్‌‌ ధరించడం ‘బలహీనతకు సంకేతం’! 

పెళ్లి, ఇతర ప్రైవేట్‌ ఫంక్షన్లకు 50మందికి మించి అనుమతి లేదని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అలానే ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి అంది. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారిని ఈ వేడుకలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వేడుకకు హాజరయ్యే వారి పూర్తి వివరాలను సేకరించాలని సూచించింది. అంతేకాక వేడుక జరిగే చోట శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్క్‌లు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించింది. మరి ముఖ్యంగా ఈ వేడుకల్లో మద్యపానానికి ఎట్టి పరిస్థితుల్లోను అనమతిచ్చేది లేదని కర్ణటక హోం శాఖ తెలిపింది. అలానే కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రజలు ఈ వేడుకలకు ఎట్టి పరిస్థితుల్లో హాజరుకాకుడదని పేర్కొంది.(లాక్‌డౌన్: ముంబై నుంచి బిహార్‌కు ఆటోలో

మరిన్ని వార్తలు