ప్రొఫెసర్ ప్రాణం తీసిన నిర్లక్ష్యం

26 Oct, 2016 11:12 IST|Sakshi
ప్రొఫెసర్ ప్రాణం తీసిన నిర్లక్ష్యం

అలీగఢ్: అధికారుల నిర్లక్ష్యం సీనియర్ ప్రొఫెసర్ ప్రాణం పోవడానికి కారణమైంది. సమయానికి అంబులెన్స్ ఏర్పాటు చేయడకుండా అలసత్వం ప్రదర్శించడంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్ లో అలీగఢ్ లో మంగళవారం ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మోడ్రన్ ఇంగ్లీషు లాంగ్వేజ్ విభాగానికి అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ డి. మూర్తి(64) క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనకు ఆదివారం క్యాంపస్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే ఢిల్లీకి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో అధికారులు తీవ్రజాప్యం చేయడంతో ఆరోగ్యం విషమించి ఆయన ప్రాణాలు వదిలారు.

అంబులెన్స్ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలు తయారు చేయడానికి ఆరు గంటలకు పైగా సమయం తీసుకున్నారని యూనివర్సిటీ సిబ్బంది ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే మూర్తి చనిపోయారని మండిపడ్డారు. సమయానికి అంబులెన్స్ ఏర్పాటు చేయలేదని.. సీఎంఓ, డాక్టర్లకు మధ్య సమన్వయం లేదని మూర్తి స్నేహితుడు ప్రొఫెసర్ షేక్ మస్తాన్ విమర్శించారు.

>
మరిన్ని వార్తలు