‘ప్రైమరీ స్కూల్‌ పిల్లలకు బ్యాగ్‌ అవసరం లేదు’

15 Jun, 2018 22:02 IST|Sakshi

చండీగఢ్: ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హర్యానా ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఒకటి, రెండో తరగతి చదువుతున్న పిల్లలు పాఠశాలకు బ్యాగ్‌లు తీసుకురావల్సిన అవసరం లేదని ప్రభుత్వం  ఆదేశాలు జరిచేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్‌బిలాస్‌ శర్మ శుక్రవారం ప్రకటన చేశారు. గతకొంత కాలంగా  ప్రైమరీ స్కూల్‌ పిల్లల బ్యాగుల బరువు తగ్గించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మద్రాస్‌ హైకోర్టు  జారీ చేసిన ఉత్వర్వులను అమలు చేయలని హర్యానా ప్రభుత్వం భావించింది.

ప్రైమరీ స్కూల్‌ పిల్లలకు బరువైన బ్యాగులు,  అధిక హోం వర్కుల నుంచి ఉపశమనం కల్పించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రాలను ఆదేశించాలని మే 30న మద్రాస్‌ హైకోర్టు సిఫారస్సు చేసిన విషయం తెలిసిందే. పిల్లల బరువులో పదిశాతానికి మించి బ్యాగ్‌ బరువు ఉండకూదని మద్రాస్‌ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విద్యా సంవత్సరం  నుంచే ప్రభుత్వ ఆదేశాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఆదేశించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా