పత్రికల ప్రచురణపై నిషేధం విధించలేదు

19 Jul, 2016 16:40 IST|Sakshi
పత్రికల ప్రచురణపై నిషేధం విధించలేదు

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో పత్రికలపై నిషేధం విధించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు తెలిపారు. కల్లోల పరిస్థితులు నెలకొన్న కశ్మీర్‌లో ఇంగ్లీషు, ఉర్దూ, కశ్మీరీ భాషల్లో వెలువడుతున్న పత్రికల ముద్రణను పోలీసు అధికారులు నిలిపివేసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు.. సోమవారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

కశ్మీర్లో కర్ఫ‍్యూ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రచురణను ఆపాల్సిందిగా పత్రికాధిపతులను, ఎడిటర్లను కశ్మీర్ మంత్రి, ప్రభుత్వ ప్రతినిధి కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగాఈ వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అమితాబ్ మట్టూ తోసిపుచ్చారు. కశ్మీర్లో భద్రత బలగాలు హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీతో పాటు అతని ఇద్దరు సహాయకులను కాల్చిచంపిన తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో 30 మందికిపైగా మరణించారు. పదిరోజుల నుంచి కశ్మీర్లో కర్ఫూ వాతావరణం ఏర్పడింది.

>
మరిన్ని వార్తలు