అనుమతి తీసుకున్నాకే పౌరులపై నిఘా

31 Dec, 2018 05:33 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకున్నాకే పౌరుల కంప్యూటర్లపై నిఘా పెట్టాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో ఏ విచారణ సంస్థకూ సంపూర్ణ అధికారాలు అప్పగించలేదన్నారు. 2009లో తెచ్చిన నిబంధనల మేరకే ఈ నిఘా కొనసాగుతోందనీ, వీటిలో చిన్నమార్పు కూడా చేయలేదన్నారు. పౌరుల కంప్యూటర్లలోని సమాచారంపై నిఘాతో పాటు డీక్రిప్ట్‌ చేసే అధికారాన్ని 10 ప్రభుత్వ సంస్థలకు అప్పగించడంపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా