'అజార్ అరెస్టా.. ఇంకా కన్ఫర్మ్ కాలేదు'

13 Jan, 2016 22:13 IST|Sakshi

ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడిలో సూత్రదారి మౌలానా మసూద్ అజార్ అరెస్టుపై తమకు అధికారిక ప్రకటన సమాచారం లేదని భారత్ స్పష్టం చేసింది. అతడు అరెస్టు అయ్యాడా లేదా అనే విషయంపై పాక్ నుంచి తమకు ధ్రువీకరణ సమాచారం అందలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. పాకిస్థాన్ మంత్రి మహ్మద్ జుబెయిర్ కూడా ఇదే అంశాన్ని తెలిపారు. మసూద్ అజార్ అరెస్టు అయ్యాడని వార్తను ఇప్పుడే పక్కాగా చెప్పలేమని, అయితే, అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో చాలామందిని అరెస్టు చేసినట్లు ఆ మంత్రి తెలిపారు.

జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్‌ అధినేత మౌలానా మసూద్ అజార్‌ను ఇస్లామాబాద్‌లో భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నట్టు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూప్‌ కార్యాలయాలపై దాడులు జరుపుతూ.. వాటిని మూసివేస్తున్న సైన్యం.. ఇందులో భాగంగా మసూద్, అతని నలుగురు కీలక అనుచరులని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని పాకిస్థాన్‌కు చెందిన జీయో న్యూస్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు