‘ఆ రోజు కుట్ర ఏమీ జరగలేదు’

30 May, 2017 19:13 IST|Sakshi
‘ఆ రోజు కుట్ర ఏమీ జరగలేదు’

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి ఎలాంటి కుట్ర జరగలేదని, అదొక బహిరంగ ఉద్యమంలాగా ప్రారంభమై ధ్వంసం వైపు మళ్లిందని కేంద్ర మంత్రి ఉమా భారతీ అన్నారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కుట్రపూరిత నేరం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు మంగళవారం బెయిల్‌ లభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘ డిసెంబర్‌ 6, 1992న నేను అయోధ్యలోనే ఉన్నాను. ఇది రహస్యం కాదు. కోట్లమంది బీజేపీ కార్యకర్తలు, లక్షలమంది అధికారులు, వేల మంది రాజకీయ నాయకులు ఆ రోజు పాల్గొన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి ఉద్యమం వచ్చిందో అదే తరహాలో అప్పుడది ఒక బహిరంగ ఉద్యమం. నాకు అందులో ఏ కుట్ర కనిపించలేదు’  అని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు